PS Telugu News
Epaper

ఫ్రెండ్స్ సహారా సొసైటీ రక్తదానశిబిరంలో విశేష స్పందన

Listen to this article

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి

తాడిపత్రి: పట్టణ పరిధిలోని హజరత్ సిద్ధిఖ్ భాషా దర్గా నందు గురువారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి 1500 సంవత్సరాల జన్మదినాన్ని పురస్కరించుకొని మీలాద్ ఉన్ నబీ పండుగ శుభ సందర్భంగా ఫ్రెండ్స్ సహారా సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాడిపత్రి పట్టణ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, తాడిపత్రి పట్టణ ప్రభుత్వ ఖాజీ సయ్యద్ హయ్యద్ బాషా ఖాద్రి లు హాజరయ్యారు. అలాగే వారికి ఫ్రెండ్స్ సహారా సొసైటీ సభ్యులు శాలువతో ఘనంగా సత్కరించి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే రక్త దాతలకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ శిబిరంలో 91 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో విశేష స్పందన లభించింది. అనంతరం ఫ్రెండ్స్ సహారా సభ్యులు మాట్లాడుతూ.. రక్తం దానం చేయడం వలన దాత ఆరోగ్యం మేరుగుపడడమే కాకుండా ఆపదలో ఉన్న వారికి రక్త దానం చేసి వారి ప్రాణాలను కాపాడవచ్చునన్నారు. ఎంతోమంది పేదవారికి రక్తం అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారని, అలాంటి వారికి రక్త దాన శిబిరాల ద్వారా రక్తం అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే గర్భవతులకు, తలసెమియా, సికిల్‌ సెల్‌అనిమియా, హిమోఫిలియా వంటి రోగులకు నిరంతరం రక్తం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సహారా సభ్యులు కరీముల్లా, అలీ, షోహేబ్, అజీమ్, జిలాన్, జాఫర్, జావిద్ అల్లా బకాష్, ఖాజా మరియు మత పెద్దలు కే.జీ.న్ పవర్ టూల్స్ రఫీ, దాదా, దాదు రిహాన్, మౌలా, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top