
రుద్రూర్, సెప్టెంబర్ 6 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ గ్రామంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75 వ వజ్రత్సవాలలో భాగంగా శనివారం తెలంగాణ కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ మండలి నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, మాజీ జడ్పిటీసి నారోజి గంగారాం, ఇందూర్ కార్తిక్, కిసాన్ కేత్ అధ్యక్షులు అడప సాయిలు, గణేష్ మండలి అధ్యక్షులు చిదుర వీరేశం, కర్క అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.