జనతా వారధిలో భాగంగా గుంటూరులో బీజేపీ వినతి

పయనించే సూర్యుడు జూలై 14 ముమ్మిడివరం విద్యుత్ మీటర్లు, ఈఆర్‌సి వ్యవస్థపై పరిష్కారం కోరిన పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు అధ్యక్షతన, జిల్లా సమన్వయకర్త షేక్ సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా ఇన్చార్జి యాళ్ల దొరబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పేదలకు ఇస్తున్న విద్యుత్ మీటర్లపై ప్రజలు ప్రీమియం చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని వినతిలో పేర్కొన్నారు. ఒక ఆధార్ కార్డుపై ఒకటికి మించి విద్యుత్ మీటర్లు ఉండటం, విద్యుత్ శాఖలోని ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సరిగా పని చేయకపోవడం వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, నాయి బ్రాహ్మణ, చేతివృత్తుల వారికి ఈ వ్యవస్థను మెరుగుపరిచి వారికి తగిన లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహ సమన్వయకర్త మార్తా నరేంద్ర, కత్తి మేరీ సరోజినీ, అబ్రహం, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీను నాయక్, ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షులు ధారా అంబేద్కర్, గుంటూరు జిల్లా బీజేపీ కార్యదర్శి నారాయణరెడ్డి తో పాటు కార్యకర్తలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.