
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 11
ఆంధ్రప్రదేశ్ అంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో చింతూరు అంగన్వాడి ప్రాజెక్టు మహాసభ జరిగింది ఈ మహాసభ కి ప్రాజెక్ట్ కార్యదర్శి నూకరత్నం జెండా సీఐటీయూ జెండా ని ఆవిష్కరణ చేశారు. అనంతరం ఈ మహాసభ కి అధ్యక్ష వర్గంగా సవనం వెంకటరమణ. నూక రత్నం. వహించారు ఈ మహాసభ కి ముఖ్య అతిథులుగా సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్. అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి బి నిర్మల. పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన పల్లపు వెంకట్ మాట్లాడుతూ అంగన్వాడి కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తించి. వారికి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గతంలో దాదాపు 42 రోజులు పాటు సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మెలో భాగంగా కొన్ని హక్కుల్ని సాధించడం జరిగింది అలానే మిగతా సమస్యలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి. అంగన్వాడి కార్మికులను కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలి. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్ కి మార్చుతూ జీవో ఇచ్చారు దాన్ని వెంటనే అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తూ పని గంటలు పెంచుతు జీవోలు విడుదల ఆ జీవోలు అన్ని కూడా వెంటనే రద్దు చేయాలి. యావత్ కార్మికుల లోకం ఇంత కూడా ఐక్యంగా ఉండి ఈ ప్రభుత్వాలు కుట్రలు తిప్పి కొట్టాలని అన్నారు . అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి బి నిర్మల మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అంగన్వాడీ సమస్యల పైన భారీ ఎత్తున పోరాటాలు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ కార్మికులకు నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలి. లేక రకాల యాప్ను తీసుకొచ్చి అంగన్వాడి కార్మికుల పైన ఈ కూటమి ప్రభుత్వం పని ఎప్పటికీ గురిచేస్తుంది అలా కాకుండా ఒకే యాప్ ద్వారా పని విధానాన్ని తగ్గించాలని అన్నారు. మహా సభ లో అంగన్వాడి యూనియన్ అధ్యక్షురాలు రాజేశ్వరి. గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్. సిఐటియు మండల కార్యదర్శి పోడియం లక్ష్మణ్. సెక్టర్ లీడర్లు నాగమణి. చిట్టమ్మ. భద్రమ్మ. సరిత. దుర్గ. పార్వతి. అంగన్వాడి కార్మికులు. సావిత్రి. కిట్టమ్మ. శేషమ్మ. రాములమ్మ. దుర్గ. తదితరులు పాల్గొన్నారు.