
జనం న్యూస్ సెప్టెంబర్ 12 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
గాజుల రాకేష్ సుమరు 38 సంవత్సరాలు. ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ చెందిన వ్యక్తి హుజురాబాద్ మౌంటసరి స్కూల్లో పనిచేస్తున్నాడు సుమారు నైట్ 3.30గం ప్రాంతంలో పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా, నైట్ కురిసిన వానకు గోపాల్పూర్ తాళ్లవాగు బీభత్సం గా సాగుతుంది దాన్ని దాటడానికి ఇంటికి చేరాలా అనే ఆలోచనతోని ప్రయత్నించి మూడో పిల్లర్ దాకా వెళ్ళాడు. ఆ వేగానికి తట్టుకోలేక బ్రిడ్జిపై పిల్లర్లు పట్టుకొని అరుపులు వెయ్య సాగాడు అటునుండి అరుపులు వినిపిస్తున్నాయని గమనించిన గోపాల్ పూర్ కు చెందిన. బోయినపల్లి కిషన్ రావు అనే వ్యక్తి గమనించి వెంటనే ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ 100కు డయల్ చేశాడు. వెంటనే స్పందించిన సీఐ, ఎస్ఐ వెంటనే స్పందించి ఆ నైటు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అతన్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. రాకేష్ వారికి ధన్యవాదాలు తెలిపారు. చెప్పగానే స్పందించి వ్యక్తిని కాపాడినందుకు గ్రామస్తులు ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, కానిస్టేబుల్ బక్కయ్య, వికిల్, రాజులకు కృతజ్ఞతలు తెలిపారు.
