మొహర్రం ఆషూర్‌ఖానాలకు ఆర్థిక సాయం పంపిణీ
అమలాపురంలో ఎమ్మెల్యే ఆనందరావు చేతుల మీదుగా అందజేత
పయనించే సూర్యుడు, జూలై 15: ముమ్మిడివరంముమ్మిడివరం ప్రతినిధి రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో మొహర్రం పండుగ సందర్భంగా ఆషూర్‌ఖానాల నిర్వహణకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ప్రముఖ నాయకులు సోంబాబు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుడు హాజీ ముకరం హుస్సేన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ హజీజ్ రాష్ట్రం లోని 251 అషూర్ ఖానాలకు మంజూరు చేసిన నిధులలోఅమాపురంకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆషూర్‌ఖానాల నిర్వాహకులకు అందజేశారు. ప్రతి ఆషూర్‌ఖానాకు రూ.5,000 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ, పవిత్ర మొహర్రం పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముస్లిం సోదరుల అభ్యున్నతికి అన్ని విధాలా అండగా నిలుస్తామని పేర్కొన్నారు.రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ రాష్ట్రవ్యాప్తంగా 251 ఆషూర్‌ఖానాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టారని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావుమహమ్మద్ బషీర్, అబ్బాస్ అలీ, కర్రర్ హుస్సేన్, స్థానిక ముస్లిం పెద్దలు, మైనారిటీ విభాగం నాయకులు, వార్డు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.