PS Telugu News
Epaper

తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల చేరికలు.

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య సెప్టెంబర్ 13

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ మంచిర్యాల ఇంచార్జి మహేష్ వర్మ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తీన్మార్ మల్లన్న ఆశయ సాధనకై పనిచేసేందుకు, రానున్న రోజుల్లో మన పార్టీ జెండాను ఎత్తుకునేందుకు ఈ రోజు ముందుకు రావడం జరిగింది. వారికి మంచిర్యాల జిల్లా ఇంచార్జి మహేష్ వర్మ తీన్మార్ మల్లన్న తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ కండువాను కప్పి ఆహ్వానించడం జరిగింది. అనంతరం మహేష్ వర్మ మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు చైతన్యం అయ్యారని రానున్న బీసీ పార్టీలో పనిచేసేందుకు వివిధ పార్టీల కీలక నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ నెల 17 వ తేదీన తీన్మార్ మల్లన్న గారి సారధ్యంలో ప్రకటించనున్న బీసీ ల పార్టీలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని, మన రాజకీయ వాటా, హక్కులను, విద్యా, వైద్యం, సత్వర న్యాయం ప్రజలకు అందేవిధంగా పని చేసేందుకు బీసీ పార్టీ జెండాను ఎత్తుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీసీ పార్టీ పోటీ చేయబోతుందని, అగ్రవర్ణాల నాయకులకు ప్రజలు తమ ఓటుతోనే బుద్ధి చెబుతారని అన్నారు. ఇప్పటికైనా అగ్రవర్ణాల నాయకులకు ఊడిగం చేస్తున్న బీసీలు సోయికి రావాలని, మన సొంత పార్టీ జెండాను పట్టుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ రాజ్యాధికార సాధనలో పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసి రావాలని కోరారు. వచ్చేది బీసీల రాజ్యమే అని స్పష్టం చేశారు. ఈ నెల 17 వ తేదీన తీన్మార్ మల్లన్న సారధ్యంలో బీసీ ల పార్టీ ప్రకటిస్తున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా నుండి ప్రతి ఒక్కరు బీసీ పార్టీ ప్రారంభోత్సవానికి స్వచ్ఛందంగా కదిలి రావాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు నియోజకవర్గాల్లోని బీసీల, బహుజనుల ఐక్యతను చాటే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలో బీసీల పార్టీ సత్తా చాటుతామని మంచిర్యాల జిల్లా ఇంచార్జి మహేష్ వర్మ వ్యాఖ్యానించారు. తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ నాయకులు, జిల్లా మహిళా నాయకురాలు పుట్ట లావణ్య, చిరంజీవి, తిరుపతి, ఠాకూర్ సుశీల్ కుమార్, సంగీత లు మల్లన్నగారికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దాస్యపు దీపక్ కుమార్, పడాల శివతేజ పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top