
అప్పాజీపల్లి గ్రామ సమీపంలో గల సక్రితాండాలో గత వారం రోజులుగా ప్రజలు ఇబ్బందు పడుతున్న తీరును చూసి సొంత డబ్బులతో మోటార్ వేయించిన గ్రామ యువకుడు
బాలానగర్ మండలం జడ్చర్ల తాలూకా సెప్టెంబర్ 12 పయనించే సూర్యుడు మండల రిపోర్టర్ ఆర్ కృష్ణ
బాలానగర్ మండల పరిధిలోని అప్పాజీ పల్లి గ్రామ శివారులో గల సక్రితాండాలో త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ గ్రామ నివాసి అయిన వెంకటేష్ నాయక్ అనే యువకుడు తన తండా ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి మోటారుకు కేబుల్ వైర్ కు అయ్యే ఖర్చులు సొంతంగా భరించి గ్రామంలో గల మహిళలకు నీటి కష్టాలు తీర్చి నీటి కష్టాలను తొలగించారు తన గ్రామానికి సేవ చేసే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ యువకులు మహిళలు తనకు కృతజ్ఞతలు తెలిపారు