
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14(వైరా నియోజకవర్గ రిపోర్టర్ ఆదూరి ఆనందం )
పెనుబల్లి మండల పరిధిలో గల కుప్పెనకుంట్ల, ముత్తగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో బహుజన అభ్యుదయ సేవా సమితి మరియు అనుబంధ సంస్థ అయిన హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ సొసైటీ నేషనల్ మహిళా అధ్యక్షురాలు ఆదూరి మణి అధ్యక్షతన మానవ హక్కులు- చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది.ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం మాట్లాడుతూ మానవ హక్కులలో పొందుపర్చిన ఆర్టికల్ 26 ప్రకారం విద్యా హక్కు చట్టం -2009 వచ్చిందని, ఈ చట్టం ద్వారా 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్భంద విద్య అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సకల సదుపాయాలను కల్పిస్తుందని, ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ లక్ష్య సాధనకు విద్యను ఆయుధం గా మలచుకోవాలని విద్యార్థులకు సూచించారు. లక్ష్యాలను సాధించే క్రమంలో చెడు అలవాట్లను వదిలివేసి, మంచి అలవాట్లను అలవార్చుకోవాలని కోరారు. చదువుపై ప్రభావం చూపే సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు.ఈ సందర్బంగా హ్యూమన్ రైట్స్ సొసైటీ జాతీయ ప్రధాన కార్యదర్శి చిల్లిముంత వెంకటేశ్వరావు మాట్లాడుతూ 1946 లో విశ్వ మానవ హక్కుల ప్రకటన జరిగిందని బాల కార్మిక చట్టం గూర్చి తెలియజేస్తూ 18 సంవత్సరాల లోపు పిల్లలంతా బడిలోనే ఉండాలని, పనిలో ఉండకూడదని అన్నారు.ఆన్లైన్ మోసలకు బలికావద్దని, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగుల వెంకటేశ్వరావు, జిల్లా జాయింట్ సెక్రటరీ గంజాయి కుమారి లు బాలల హక్కులు, బాల్య వివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మొదలగు వాటిపై మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కుప్పెనకుంట్ల, ముత్తగూడెం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
