
పయనిoచే సూర్యుడు సెప్టెంబర్ 13 మధిర న్యూస్
మధిర కోర్టు ప్రాంగణం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరం అయ్యాయని మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ శ్రీమతి ఎన్. ప్రశాంతి తెలియజేసారు. ఇందులో భాగం గా 2 బెంచీలు ఏర్పటు చేయబడ్డాయి. లోక్ అదాలత్ లో బాగం గా మామా కోడలైన లంక రాధా మరియు లంక వెంకటేశ్వర్లు మద్య భూ తగాధ ని పరిష్కరించి అవార్డు కాపీ అందజేయడం జరిగింది. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు కేసులు పరిష్కరించబడ్డాయి కార్యక్రమం లో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వేముల దీప్తి , పబ్లిక్ ప్రాసిక్యూటర్ జున్ను భద్రయ్య , సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అబ్రహం , బార్ ప్రెసిడెంట్ బి పుల్లారావు, మధిర టౌన్ ,రూరల్, ఎర్రుపాలెం ఎస్సైలు పాల్గొన్నారు. సీనియర్ జడ్జి యన్ .ప్రశాంతి మాట్లాడుతూ కక్షీ దారులు తమ సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోకుండా రాజీపడదగినటువంటి కేసులు రాజీ పడాలని రాజీమార్గమే రాజమార్గమని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుగుతుందన్నారు.కేసులు రాజీ పడదగినట్లయితే ఎప్పుడైనా కొట్టివేయడం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్ లో సుమారుగా 400 (సివిల్, క్రిమినల్, డ్రంకు అండ్ డ్రైవ్, యాక్సిడెంట్, లోన్, ఆస్తి తగాదాలు, తదితర కేసులు ) కొట్టివేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు కూడా లోక్ అదాలత్ ఉపయోగించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ మరియు జూనియర్ అడ్వకేట్స్ కక్షిదారులు, పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది, పారా లీగల్స్ కన్నెపోగు వెంకటేశ్వర్లు (కెవిఆర్), వెంకట్, సుజాత తదితరులు పాల్గొన్నారు.