
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 15
దేశంలో ఆదివాసీల సమస్యలకు రాజ్యాంగ పరిష్కారం కావాలని భారత రాష్ట్రపతి,ప్రధానమంత్రి,ఆంధ్రప్రదేశ్ గవర్నర్,ముఖ్యమంత్రులకు జిల్లా కలెక్టర్ ద్వారా వినతిపత్రాన్ని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కిల్లో ప్రసాద్ రావు అందించారు.దేశ వ్యాప్తంగా అబోరిజినల్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారత రాష్ట్రపతి, ప్రధాని,గవర్నర్,ముఖ్యమంత్రులకు జిల్లా కలెక్టర్లు ద్వారా వినతిపత్రం దించారు.వినతిపత్రంలో వివరాల్లోకి వెళ్తే సుప్రీంకోర్టులో కైలాస్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం 5 జనవరి 2011న ఇచ్చిన చారిత్రాత్మక ఉత్తర్వులో,డాక్యుమెంటరీ ఆధారాలు ఆధారంగా,వాస్తవ నివేదికలు మరియు పరిశోధనలను ఉదాహరించిన నివేదిక నిరూపితమైన సత్యాన్ని అంగీకరిస్తూ భారత దేశంలోని అసలు నివాసితులు,వారసులు ఆదివాసీలని,భారతదేశానికి మూల బీజాలు,మూల జన్మ మరియు మూల నేల అయిన 12 కోట్ల మంది ఆదివాసిలకు రాజ్యాంగ పరమైన అన్యాయం జరుగుతుందని,26 జనవరి 1950 నుండి 13 సెప్టెంబరు 2025 వరకు ఆదివాసీల యాజమాన్యంలోని లేదా నియంత్రిత లేదా ఆక్రమిత ఆధాయం లేదా పచ్చిక బయళ్ళు లేదా అటవీ భూమిని ప్రభుత్వం యంత్రాంగం ఎంత లాక్కుందో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీ వేసి శ్వేతపత్రం విడుదల చేసి మొత్తం భూమిని రాజ్యాంగ లీజుగా నమోదు చేసి తగిన రాయల్టీ చెల్లించాలని,1871లో బ్రిటీషు ఇండియాలో జనాభా లెక్కల ప్రారంభం అయినప్పటినుండి 1931 వరకు ఆదివాసీలకు ప్రత్యేక మత కాలమ్ కోడ్ ఉండేది,తదుపరి జనాభా లెక్కలలో ఆదివాసీలకు స్వతంత్ర మత కాలమ్ కోడ్ లేదు జనాభా లెక్కలలో ఆదివాసీలకు స్వతంత్ర మత కాలమ్ కోడ్ ఉండాలని,ఎనిమిదో షెడ్యూల్డ్ లో ఆదివాసీల భాషలను చేర్చాలని,షెడ్యూల్డ్ ప్రాంతాల నదులలో గిరిజనులకు నీటి రిజర్వేషన్ ఉండాలని,షెడ్యూల్డ్ ప్రాంతంలో అడువులలో ఆదివాసీలకు సాంప్రదాయక అడ్డంకులు లేని కదలికలను కొనసాగిస్తూ, అటవీ చట్టాలను సవరించాలని,షెడ్యూల్డ్ ప్రాంతంలో ఇంగ్లీషు మద్యం వ్యాపారం నిషేధించాలని,ఐదో షెడ్యూల్డ్ లోని ఆర్టికల్ 244(1)స్పూర్తికి అనుగుణంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని,నాన్ షెడ్యూల్డ్ ప్రాంతంలో గల ఆదివాసీల భూములకు రక్షణ కల్పించాలని,ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు శెలవు ప్రకటించాలని,గిరిజన ఉప ప్రణాళిక బడ్జెట్ వినియోగించాలని,దేశ రాజధాని ఢిల్లీతో పాటు 10 షెడ్యూల్డ్ ప్రాంత రాష్ట్ర రాజధానులలో ఆదివాసీ భవన్ లు నిర్మించాలని,దేశ వ్యాప్తంగా ఒకే దేశం ఒకే విద్యా వ్యవస్థ అమలు చేయాలని,ఆధివాసీ హక్కులు,చట్టాల అమలు చేయని జిల్లా అధికారులు జవాబుదారీ ఉండడానికి చట్టం చేయాలని, నకిలీ గిరిజన కుల ధ్రువీకరణ పత్రాలు నియంత్రణ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని,జిల్లా స్థాయిలో గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలని,షెడ్యూల్డ్ కానీ ప్రాంతం నుండి వచ్చిన ఆదివాసీల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని,భారత్ ప్రభుత్వం ఇంకా ఐఎల్ఓ కన్వెన్షన్ 169(1989)మీద ఇంకా సంతకం చేయలేదు, వెంటనే సంతకం చేసి అమలు చేయాలని,సమత వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం(1997) కేసులో సుప్రీంకోర్టు భూమి ఆదివాసీ సొంతం ఖనిజాలు అతని సొంతం అనే సూత్రాన్ని నిర్దేశించచింది.ఆ సూత్రాన్ని పూర్తిగా అమలు చేయాలని,షెడ్యూల్డ్ ప్రాంతంలో ప్రవేట్ కంపెనీలకు మైనింగ్ లీజులు ఇవ్వడం నిషేధధించాలని,సుప్రీంకోర్టు (2013-14)బొగ్గు గనులను రద్దు చేస్తూ పబ్లిక్ ట్రస్ట్ వర్తింప చేసింది.దీని ఆధారంగా గిరిజనుల ఖనిజ సంపద పై వారి సమాజ హక్కులనునిర్ధారరించాలి. రాజ్యాంగంలోని 5,6 వ షెడ్యూల్డ్ ల నిర్లక్ష్యంపై ఉన్నత స్థాయి రాజ్యాంగ సమీక్ష ఏర్పాటు చేసి నిర్ధిష్టమైన చర్య తీసుకోవాలని, పీసా (1996) చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామ సభ ఆధిపత్యం చేయాలని,అటవీ హక్కుల చట్టం (2005)ని సమర్ధవంతంగా అమలు చేయాలని,భూసేకరణ చట్టం(2013)లో న్యాయమైనా పరిహారం పారదర్శకత హక్కు 2013పూర్తి సమ్మతినిర్ధారరించబడాలని, ఆదివాసీ ఆచారాలు, లిపులు,నృత్యం,సంగీతం మరియు ఆరాధన పద్దతులు భారత దేశ ఆవ్యక్తసాంస్కృతతిక వారసత్వంగాపరిగణించబడి, దాని వారసత్వ సంపదగా నమోదు చేసి పరిరక్షించాలని,శ్రీమాన్,కేవాడియా(గుజరాత్) మరియు హస్టియ అరణ్య (చత్తీష్ఘర్) ఆదివాసీలపై జరుగుతున్న అమానీయమైనా రాజ్యాంగ విరుద్ధమని అన్యాయాన్ని వెంటనే ఆపాలని,బస్తర్ (ఛత్తీస్ఘర్)ఆదీవాసీలకు జీవించే హక్కు హరించడంలో ప్రభుత్వ పోలీసులు మరియు పారామిలిటరీ దళాలు కార్యకలాపాలను వెంటనే ఆపి,చర్చల పక్రియను అవలంబించాలి. శ్రీమాన్ ఆదివాసీ ప్రకృతి శక్తి పూర్వీకుల శక్తి పూజా సామాగ్రి మహువా సారం ఆదివాసీలకు పేటెంట్ ఇవ్వాలని,దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలకు ఉచిత రోడ్డు టోల్ ఉద్యమం కోసం స్వదేశీ కార్డు జారీ చేయాలని కోరుతూ వినతిపత్రం అందించడం జరిగింది.