
జనరల్ సెక్రెటరీ గా కాజా రుక్ముద్దీన్
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్.
ఆదోని డివిజనల్ అగ్రి ఇన్పుట్స్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ 12 వ వార్షికోత్సవం ఆదోని పట్టణంలోని తిరుమల నగర్ లో గల శంకర్ మఠంలో గౌరవ అధ్యక్షులు అశోకానంద రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రిస్వామి పాల్గొని మాట్లాడారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు ఆదోని డివిజనల్ అగ్రి ఇన్పుట్స్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా కోటేష్, ఉపాధ్యక్షులుగా రామలింగేశ్వర స్వామి, జనరల్ సెక్రెటరీగా కాజా రుక్ముద్దీన్, కోశాధికారిగా లోకేష్ స్వామి లతోపాటు ఆర్గనైజర్లు ఎగ్జిక్యూటివ్ నెంబర్లుగా మరో 26 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జనరల్ సెక్రెటరీగా ఎన్నికైన కాజా రుక్ముద్దీన్ మాట్లాడుతూ అసోసియేషన్లో ఉన్న సభ్యులకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు నా మీద నమ్మకం ఉంచి జనరల్ సెక్రెటరీగా ఎన్నుకున్న పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిష్పక్షపాతంగా పనిచేస్తాననారు.