
అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరిక — నూతలపాటి వెంకటేశ్వరరావు..
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15, (చింతకాని మండల రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు).
మధిర నియోజకవర్గ చింతకాని మండలం అనంతసాగర్ గ్రామంలో నిన్న సాయంత్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమ్మంటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి 200 పైగా కుటుంబాలు నందిని విక్రమార్క చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అనంతసాగర్ గ్రామ మాజీ సర్పంచ్ నూతలపాటి మంగతాయమ్మ నాయకత్వంలో మరియు నూతలపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో ఆయనకు అనుసంధానమైనటువంటి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ సర్పంచ్ మంగతాయమ్మ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభివృద్ధి కార్యక్రమాలకు మరియు కాంగ్రెస్ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చెప్పటం జరిగింది. ఇప్పటినుంచి మేమందరం కూడా పార్టీకి తోడుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ఇంకా ప్రజల్లోకి తీసుకువెళుతూ మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా ఎన్నో చేస్తూ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే ప్రజలకు అవసరమైనటువంటి అన్ని అవసరాలను తీరుస్తామని మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ శాసనసభ్యులు కొండబాల కోటేశ్వరరావు, మాజీ నాయకులు చల్ల అచ్చయ్య, జానపాటి ఆదినారాయణ, జడ సుధాకర్, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు, మండల ఇన్చార్జులు, గ్రామ ఇన్చార్జులు మరియు గ్రామంలో ఉన్న కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
