
బిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కానుగుల జోగయ్య
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 15 2025, నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి : వెల్దండ మండల కేంద్రానికి చెందిన కొప్పు నర్సింహ ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురై హార్ట్ స్టోక్ రావడం జరిగింది. హైదరాబాద్ లోని ఒక్క హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటికి రావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కానుగుల జోగయ్య ఆదివారం బాధితుని పరామర్శించి 5000 రూపాయలను తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ జంగిలి నిరంజన్, మాజీ ఎంపీటీసీ లింగం, మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్, మాజీ వార్డు మెంబర్ అంజయ్య, యువ నాయకులు సిర్సనగండ్ల శేఖర్, బిట్టి సైదులు, పిల్లి శ్రీను, మట్ట పర్వతాలు గౌడ్, మల్లేష్, కట్ట అనిల్, మక్కపల్లి యాదగిరి, నాగిల్ల శివరాజ్, వానరాశి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.