
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
ఈ సంవత్సరం అక్టోబర్ 2న మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని తేదీ:18.09.2025 నుంచి తేదీ:02.10.2025 వరకు “స్వచ్ఛత హీ సేవ” అను కార్యక్రమం చేయుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన నేపధ్యంలో సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిథిలో CTU యూనిట్స్ గుర్తించి మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారం సూళ్లూరుపేట పట్టణం నందు ఈరోజు “స్వచ్ఛత హి సేవ ” కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట పురపాలక సంఘం నందు CTU యూనిట్స్ శుభ్రపరచడం చేశారు సూళ్లూరు మరియు నాగరాజపురం ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ మాట్లాడుతూ పుర వీధిలో చెత్త వేయరాదని అటులనే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని కోరారు అదేవిధంగా శ్రీ భారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్, వనంతోపు నందు పిల్లలచే స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞను చేపించడం జరిగింది తదుపరి సూళ్లూరు నందు నెర్రి కాలువ ఆవరణములో మరియు ఉల్షపడవ రోడ్డు నందు శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట పురపాలక సంఘం శానిటరీ ఇన్స్పెక్టర్ (I/C) ఎ.వెంకటేశ్వర్లు సచివాలయ పారిశుధ్య మరియు పర్యావరణ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది శానిటరీ మేస్త్రిలు మరియు పరిశుధ్య కార్మికులకు పాల్గొనడం జరిగింది.

