
జాతీయ ప్రాధికార సంస్థ సహకారంతో అవగాహన సదస్సు**సదస్సు హాజరైన ప్రత్తిపాడు ఎమ్మెల్యే**
పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్ )* సెప్టెంబర్, 18:-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆరు వరసల రహదారి నిర్మాణం పై జాతీయ ప్రాధికార సంస్థ సహకారంతో, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సు కు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభహాజరు అయ్యారు. జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన కీలక అంశాలను ఈ సదస్సులో చర్చించారు. జాతీయ రహదారి నిర్మాణ సమయంలో ఎదురయ్యే సమస్యలు, అడ్డంకులు, భూమి స్వాధీనం, స్థానిక ప్రజలకు కలిగే అసౌకర్యాలు, పర్యావరణ సంబంధిత అంశాలు మొదలైన వాటిపై సవివరంగా చర్చించారు. రహదారి నిర్మాణం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం, స్థానికంగా అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చడం, ప్రజలతో సానుకూలంగా సంభాషించడం, నిర్మాణ సమయంలో తాత్కాలికంగా కలిగే రవాణా సమస్యలను పరిష్కరించడం వంటివంటి అంశాలపై అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సమాలోచనలు జరిపారు. ఎమ్మెల్యే వరపుల సత్య ప్రభ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ” దీర్ఘకాలిక అభివృద్ధిని అందించగలిగే కీలకమైన మౌలిక వసతుల్లో జాతీయ రహదారి నిర్మాణం ఒకటి అన్నారు. అయితే నిర్మాణ సమయంలో ప్రజల హక్కులు, భద్రత, జీవనోపాధి అంశాలను కాపాడుతూ పనులు సాగేలా చూడటం మన అందరి బాధ్యత” అని పేర్కొన్నారు.