
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లోని పెరుమాళ్ళపాడు గ్రామ సచివాలయం స్థానిక గ్రామంలో,స్వస్థ నారీ స్వసక్త పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందిస్థానిక వైద్య అధికారి డాక్టర్. టి. అంశుధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, పిల్లలు శ్రేయస్సు కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. మహిళలు పలు వ్యాధులకు సంబంధించిన స్క్రీనింగ్ చేసుకోవచ్చన్నారు మహిళలు ఆరోగ్య సంరక్షణను మెరుగుపర్చడం, మరింత మెరుగైన వైద్య సేవలు అందించి వారి కుటుంబాలను బలోపేతం చేయడం ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మహిళలు ఆరోగ్య కేంద్రాల్లో సేవలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచి.తలపనేని జయంతి నాయుడు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మస్తానయ్య. పి.హెచ్.యన్. జి. నవమణి . ఎం ఎల్ హెచ్ పి దివ్యశ్రీ. ఎం పి ఎం పి హెచ్ ఏ . ఆశ వర్కర్ వెంకటరమణమ్మ. 104. సిబ్బంది. అంగన్వాడీ కార్యకర్తలు,, గర్భిణీస్త్రీలు కిషోర్ బాలికలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.