
ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ….
పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 21 :- రిపోర్టర్ (కే శివకృష్ణ )
రోటరీ డిస్ట్రిక్ట్ 3150 లో సెప్టెంబర్ మాసం అక్షరాస్యత మాసం కావున ఈరోజు స్థానిక రైలు పేట పార్కు దగ్గర ఉన్న మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుని, విద్యార్థులకు, రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల, కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, వారి మనవడు దర్షిక్ సాయి నందన్ సౌజన్యంతో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, నోటు బుక్స్, పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకుని మంచి ప్రయోజకులు కావాలని, తద్వారా స్కూలుకు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు బాపట్లకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన కోరారు. అదేవిధంగా కొత్త ఆంజనేయ వారి ప్రసాద్ వారి మనవడు దర్షిక్ సాయి నందన్ ఇప్పటినుండే సేవా గుణం తో సేవ చేసే లక్ష్యంతో ముందుకు తీసుకు రావటాన్ని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, కోశాధికారి కొత్త సుబ్బారావు, సీనియర్ రోటరీ సభ్యులు బూర్లె రామసుబ్బారావు, జెవి కృష్ణారావు, మల్లికార్జున రావు, షేక్ మస్తాన్ వలి, స్కూల్ హెచ్ఎం లీలావతి, ఉపాధ్యాయులు రాజేష్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.