
అవినీతిలో అధికారుల స్టైలే వేరు
పర్మిషన్ ఒక లెక్క నిర్మాణoమరొకలెక్క
ఒక్కో నిర్మాణం దగ్గర లక్షలుముట్టాల్సిందే
అవినీతికి పరాకాష్ట పోచారం మున్సిపాలిటీ
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 (పోనకంటి ఉపేందర్ రావు )
పోచారం:ఇప్పటివరకు మనం ఎంతోమంది అవినీతి అధికారులను నిత్యం చూస్తూనే ఉన్నాం కానీ పోచారం మున్సిపాలిటీ మాత్రం అవినీతిలో ఆస్కార్ అవార్డు అందుకోవడానికి ముందు వరుసలో ఉంటుంది. రాజకీయ నాయకులతోను దగ్గరి సంబంధాలు నేరుపుతూ వారితో అంట కాగుతూ నిత్యం పోచారం పరిధిలో అవినీతికి పరాకాష్టగా మారిపోయారు. అన్ని హాస్టల్ నిర్మాణాలు జి ప్లస్ టు పర్మిషన్ తో ఆకాశాన్ని అంటే మేడలు నిర్మిస్తున్నారు.. ఒక్కో నిర్మాణం దగ్గర లక్షల రూపాయలు మెక్కుతూ అక్రమార్కులకు అండగా ఉంటున్న అధికారులు… ముఖ్యంగా పోచారం మున్సిపల్ పరిధిలోనీ యంనంపేట్ గ్రామంలో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తున్న అధికారులు మాత్రం తాను మేసిన లంచానికి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ తీసుకొని వారికి చేదోడు వాదోడుగా ఉంటూ అక్రమ సొమ్ము ఆంబోతుల వేస్తున్నారు. తన అవినీతికి ఎవరు అడ్డు రాకూడదని హుకుం జారీ చేశాడట. ఎలాగూ వారు అవినీతి సొమ్ములో మునిగి తేలుతున్నారు కాబట్టి ఇతరులు ఎవరు ప్రశ్నించకూడదని వార్నింగ్ ఇస్తున్నాడట ఈ నీచపు అధికారులు. చేసేది ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రజలను పీల్చి పిప్పి చేయడంలో వీరు పీహెచ్డీ చేశారంటారు పోచారం మున్సిపల్ ప్రజలు. ఎన్ని ఆరోపణలు వారిపై వచ్చిన తనకు ఎదురులేదని రాజకీయ నాయకుల అండ తనకు కొండంత బలం అంటూ విర్రవీగుతున్నారు.. సదరు బిల్డింగ్లకు కోర్ట్ నోటీసులు జారీ చేసినా కూడా లెక్కచేయకుండా నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి… ప్రజలకు ఎప్పుడూ ఉపయోగపడని ఈ అధికారులు తమను ముప్పు తిప్పలు పెడుతున్నాడు అంటూ స్థానిక ప్రజలు ఆక్రోషం వెళ్లగకుతున్నారు. ఇకనైనా ఈ అధికారులను సస్పెండ్ చేసి ప్రజలకు కొంతైనా మేలు చేయాలని మేధావులు ఆశిస్తున్నారు. ప్రతిరోజు నోట్ల కట్టలు లేనిదే నిద్రరాని వీరి లాంటి వ్యక్తులు సమాజానికి ఎంత ప్రమాదకరమో వీరిని చూసినప్పుడు అర్థమవుతుంది. ఇకనైనా రాజకీయ నాయకులకు కాకుండా ప్రజలకు కొంతైనా ఉపయోగపడాలని ఆశిద్దాం.