
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పదవి విరమణ ప్రయోజనాలు కల్పించాలి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 20
ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలపై విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
ఈ సమావేశంలో రంపచోడవరం డివిజన్ లో ఉన్న 17 పి హెచ్ సి ల అన్ని కేడర్ ల సిబ్బంది పాల్గొని వారి సమస్యలను ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ వారికి తెలియజేయడం జరిగింది,కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలి అప్పటి వరకు 100 గ్రాస్ శాతం జీతం ఇవ్వాలి కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కి సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలి ముగ్గురు స్టాఫ్ నర్సెస్ ఉన్న స్థానం లో ఒకరు శెలవు పెడితే ఇద్దరికి 12 గంటలు డ్యూటీ చేయడం కష్టంగా ఉంది అదనంగా ఇంకో స్టాఫ్ నర్స్ ను ఇవ్వాలి ప్రతి పి హెచ్ సి లో సెక్యూరిటీ లేదా వాచ్ మెన్ లను ఏర్పాటు చెయ్యాలి ప్రతి పి హెచ్ సికి సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్లు వెంటనే నియమించాలి కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పదవి విరమణ ప్రయోజనాలు కల్పించాలి
అలాగే జి.ఓ.నెంబర్:68 నీ పటిష్టంగా అమలు చెయ్యాలి ఈ పై డిమాండ్స్ సాధించి మన ఉద్యోగులకు బరోసాని అందించాలని అసోసియేషన్ వారికి సభ్యులు తెలియజేయడం జరిగింది అనంతరం అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు మాట్లాడుతూ ఈ పై డిమాండ్ లు సాధించాలంటే అందరూ యూనిటీగా పని చెయ్యాలని పిలుపు నిచ్చారు, త్వరలో కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ రెగ్యులర్ కోసం కార్యాచరణ ప్రకటిస్తామని తెలియ జేశారు, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అందరు ఉద్యమంలో పాల్గొని రెగ్యులర్ సాధించే వరకు పోరాటం చెయ్యాలని, అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇప్పించేల ఉద్యమం ఉంటుందని ప్రభుత్వం పై పోరాటం ఉంటుందని అన్నారు అలాగే రంపచోడవరం డివిజన్ లో సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్లు ఏర్పాటు చెయ్యాలని డిమాండు చేశారు,అనంతరం రంపచోడవరం డివిజన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షులు : టి శివ సత్యనారాయణ ఉపాధ్యక్షులు : వి చిన్నారెడ్డి ప్రధాన కార్యదర్శి : ఆర్ మంగ సహాయ కార్యదర్శి : కె వెంకట లక్ష్మి ప్రచార కార్యదర్శి : జి గిరిజ కోశాధికారి : కె పాపయమ్మ కమిటీ సభ్యులు గా 25 మందిని ఎన్నుకోవడం జరిగింది నూతన కమిటీ సభ్యులు ఉద్యోగుల సమస్యల కొరకు పని చేస్తామని హామీ ఇచ్చారు, రాష్ట్ర కమిటీ నూతన డివిజన్ కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు, ఉపాధ్యక్షులు యం సువర్ణ, ఏలూరు జిల్లా అధ్యక్షులు సున్నం శ్రీరాములు దొర, ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర రావు, చింతూరు డివిజన్ అధ్యక్షులు టి కోటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి తాటి రామకృష్ణ,రంపచోడవరం ఉద్యోగులు పాల్గొన్నారు
