
షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లికార్జున్ ను పరామర్శ
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ లో ఇటీవల ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆసుపత్రి పర్యటనలో ప్రమాదవశాత్తు గాయపడి షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ మల్లికార్జున్ జర్నలిస్టులు ఎండి ఖాజా పాషా (కేపీ), టిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు రాఘవేందర్, కస్తూరి రంగనాథ్, నరసింహారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కేపీ ప్రస్తుత పరిస్థితిని ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్యులు ఆనంద్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మల్లికార్జున్ కు సూచించారు. జర్నలిస్టులు వరుసగా గాయాల పాలు అవుతుండడం బాధాకరమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మల్లికార్జున్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వృత్తిరీత్యా అనేక సందర్భాల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని జర్నలిస్టులకు ప్రభుత్వం ద్వారా తగిన సహకారం అందించాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేశారు.
