
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 22(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
దసరా పండుగ సందర్భంగా “యాడికి యువత” ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ను వేములపాడు రోడ్డు లోని మార్కెట్ యార్డ్ గ్రౌండ్ లో యాడికి పట్టణ సి.ఐ.ఈరన్న చేతుల మీదుగా టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జూటూరు అబ్దుల్ రజాక్, తిరం పురం నీలకంఠ ,నీలూరు విశ్వనాథ్, కడ్డీల నాగేంద్ర,గుండా నారాయణస్వామి, ఇలాహి, జనసేన సునీల్, నీలకంఠ రెడ్డి, విచ్చేసి క్రీడాకారులకు పలు సూచనలు చేయడం జరిగింది. మొదటగా అతిథులు రిబ్బన్ కట్ చేసి టోర్నమెంట్ను ప్రారంభించి ప్రారంభించడం జరిగింది.మొదట మ్యాచ్లో కొనప్పలపాడు జట్టు వేములపాడు జట్లు తలపడగా వేములపాడు జట్టు పై ఉప్పలపాడు జట్టు 9 పరుగుల తేడాతో గెలుపొందడం జరిగింది. మొదటగా బ్యాటింగ్ చేసిన ఉప్పలపాడు జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 89 పరుగులు ఆల్ అవుట్ అయింది అనంతరం బ్యాటింగ్ చేసిన వేముల పాడు నిర్ణీత 10 ఓవర్లలో 80 పరుగులు చేసి తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది.రెండవ మ్యాచ్ నందు తాడపత్రి ప్రోటోగ్రాఫర్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 59 పరుగులకు ఆల్ అవుట్ అయింది అనంతరం బ్యాటింగ్ చేసిన పప్పూరు రామకోటి జట్టు ఆరు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందడం జరిగింది.అనంతరం మూడో మ్యాచ్ నందు K- 11 జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 88 పరుగులు చేయగా వాలీబాల్ లెవెన్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 80 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓడిపోయింది.మొదటి బహుమతి 40వేల రూపాయలు దాతలు: లక్ష్మీ ప్రసన్న జ్యువెలర్స్ నీలూరు విశ్వనాథ్ 30 వేలు మరియు బేల్దారి బాలకృష్ణ 10వేల రూపాయలు రెండవ బహుమతి 30 వేల రూపాయలు దాతలు: అబ్దుల్ రజాక్ డాక్యుమెంట్ రైటర్ 20వేలు మరియు అజయ్ బాబు జ్ఞాపకార్థం అరుణ్ 10వేల రూపాయలు మూడో బహుమతి 20వేల రూపాయలు దాతలు: విశ్వం – “లియో క్లబ్ & విజన్ విద్యాసంస్థలు” 10 వేలు మరియు కడ్డీల ముత్యాలు కడ్డీలు నాగేంద్ర 10 వేల రూపాయలు నాలుగవ బహుమతి పదివేల రూపాయలుదాతలు: “తిరుమల ఎలక్ట్రికల్స్” మోహన్ రెడ్డి 5వేలు “కుంభక్ డాబా” ప్రవీణ్ 5 వేల రూపాయలు
విన్నర్స్ మరియు రన్నర్స్ ట్రోఫీ లను బహుకరిస్తున్న “అను మీసేవ మరియు అను ఇంటర్నెట్ సెంటర్ ” నిర్వాహకులు ప్రభు ( బాల) ప్రతి మ్యాచ్ కు మెన్ అఫ్ ది మ్యాచ్, బెస్ట్ బ్యాట్స్మెన్,బెస్ట్ బౌలర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను బహుకరిస్తున్న వారు “స్టార్ పారడైజ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్” జమాన్యం వారు షామియానాలు మరియు కుర్చీలు అందజేస్తున్న వారు కోడి సునీల్ కుమార్ జనసేన పార్టీ, యాడికి క్రీడాకారులకు మరియు ప్రేక్షకులకు త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నతిరంపురం నీలకంఠ, గుండా నారాయణ స్వామి యాడికి టోర్నమెంట్ కు సహకారం అందించిన వారికీ నిర్వాహకులు జాన్సన్, కర్ణ,సాయి, కమల్, మధు, ప్రసన్న, కుమార్, ప్రసాద్, సుందర్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు
