
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం, బతుకమ్మ సంబరాల్లో భాగంగా సోమవారం రెండోరోజు కలెక్టరేట్ లో సంక్షేమ శాఖలచే అటుకుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులు, జిల్లా అధికారులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.ఎస్సీ, ఎస్టీ, బి.సి., మైనారిటీ తదితర సంక్షేమ శాఖల ద్వారా చేపట్టిన అటుకుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా బతుకమ్మ లు పేర్చి ఆడుతూ, పాడుతూ తెలంగాణ సంస్కృతి చాటి చెప్పే విధంగా వైభవంగా వేడుకలు జరిపారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మన సంస్కృతి ప్రతిబింబించేలా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎన్. విజయలక్ష్మి, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, మైనారిటీ శాఖ ఆర్సిఓ అరుణకుమారి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, అధికారులు, పెద్ద ఎత్తున ఉద్యోగులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
