
పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో కెమెరామెన్) గా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానం … అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో కెమెరామెన్) గా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయుటకు అర్హత గల అభ్యర్థులు ఈ నెల 25 గురువారం సాయంత్రం 5.00 గంటల లోగా దరఖాస్తులు సమర్పించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఏదైనా డిగ్రీ అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఏపీ/ తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా జారీ చేసిన సినీ ఫోటోగ్రఫీ అర్హత ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఖమ్మం, జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఈ నెల 25 గురువారం సాయంత్రం 5.00 గంటల లోగా విద్యార్హతల జిరాక్స్ కాపీలు జత చేసి తమ దరఖాస్తును సమర్పించాలని, ఎంపికైన అభ్యర్థులకు నెలకు 27 వేల 130 రూపాయలు వేతనం చెల్లించబడుతుందని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.