
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ బాల్కొండ నియోజకవర్గం లో
ఏర్గట్ల మండల కేంద్రములో రేండ్ల ముదిరాజ్ సంఘాల వారి శ్రీ బాల రాజరాజేశ్వర స్వామి మందిరం కోసం ముగ్గు పోసి పనులు ప్రారంభించినట్లు ఆలయ కమిటీ చైర్మెన్ రెండ్ల చిన్నయ్య గారు తెలిపారు. ప్రభుత్వ దేవదాయశాఖ నుండి ఏ ఈ రమేష్, సపతి వెంకటేశ్వర్లు వచ్చి ప్రభుత్వ ఆలయం ప్లాన్ వాస్తు ప్రకారం ముగ్గు పోసి కాంట్రాక్టర్ శంకర్ కు ఆలయ ప్లాన్ నిర్మాణ విధానాన్ని వివరించారు. పది లక్షలు కంట్రిబ్యూషన్ కట్టడంతో 40 లక్షలు ప్రభుత్వ దేవదాయశాఖ ద్వారా మంజూరుతో మొత్తం 50 లక్షలతో ఆలయ నిర్మాణం పనులు ప్రారంభం కావటంతో సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ దేవాదాయ శాఖ ద్వారా ఆలయ నిర్మాణానికి నిధులు ఇప్పించి ప్లాన్ అప్రోల్ చేపించి పనిని ప్రారంభించటానికి కృషి చేసిన రాష్ట్ర దేవదాయశాఖ మంత్రివర్యులు కొండా సురేఖ కి, నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క కి, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ ముత్యాల సునీలకుమార్ కి, ఏర్గట్ల గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ కు అలయ కమిటీ కమిటీ సభ్యులు, రేండ్ల వారి సంఘాల సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలుతున్నామని ఆలయ కమిటీ చైర్మెన్ రేండ్ల చిన్నయ్య తెలిపారు. ఇట్టి కార్యక్రమములో సంఘాల పెద్ద మనుషులు ఇబ్రైంపట్నం నర్సయ్య, దొబ్బల పెద్ద కిషన్, ఆలయ కమిటీ సభ్యులు రొక్కెడ చిన్న సాయన్న, దొబ్బల రాజేష్ బొర్రి, రెండ్ల రవి, ఇబ్రైంపట్నం నర్సయ్య, జక్కని శ్రీనివాస్, గుండాల పెద్ద ముత్తెన్న, రెండ్ల రాజన్న, జక్కని మోహన్, రజిని పంతులు, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెండ్ల రాజారెడ్డి, సంఘాల సభ్యులు పాల్గొన్నారు
