
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 23 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంగళవారం విశేష స్పందన లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ హరినాథ్ రెడ్డి తెలిపారు. తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి సహకారంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాకు 50కి పైగా నేషనల్ మల్టీ నేషనల్ కంపెనీలు నిర్వహించగా నిరుద్యోగ అభ్యర్థులు 266 మంది అభ్యర్థులు పాల్గొనగా, వారిలో 149 అభ్యర్థులు ఎంపికయ్యారని అందులో 54 మంది కి నియామక పత్రాలు పొందారని తెలిపారు. ఒకేసారి యాడికి మండలంలో 54 మందికి ఉద్యోగం రావడంతో మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ హరినాథ్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు
