
సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్ళీ ఉద్యమం ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 24
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో ఈ రోజు ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చింతూరు డిప్యూటీ డీ యం హెచ్ ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది గత ఐదు సం”రాలుగా చింతూరు డివిజన్ లో సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్లు లేకపోవడం వలన ఉద్యోగులు బాగా ఇబ్బందులు పడుతున్నారు అని జిల్లా కలెక్టర్ గారికి, ఐ టి డి ఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారికి, జిల్లా డి యం హెచ్ ఓ వారికి, డిప్యూటీ డీ యం హెచ్ ఓ వారికి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చిన అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం మరియు ప్రతి పి హెచ్ సి లో కంప్యూటర్ ఆపరేటర్ లను నియమించడం, ముగ్గురు స్టాఫ్ నర్సెస్ హాస్పిటల్ లో ఉండటం వలన వాళ్ళకి శెలవు విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ రెగ్యులర్ వంటి విషయాలు డిమాండ్ లతో ఈ ముట్టడి కార్యక్రమం చేసినట్టు ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు తెలియజేశారు ఈ ధర్నా కార్యక్రమనికి వచ్చిన డిప్యూటీ డీ యం హెచ్ ఓ గారు వచ్చిన ఉద్యోగాలతో మాట్లాడుతూ మీ సమస్యల పరిష్కారం కొరకు నేను పై అధికారులతో మాట్లాడి పరిష్కారనికి అధికారులతో మాట్లాడి పరిష్కారO చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం జిల్లా డి యం హెచ్ ఓ వారికి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడటం జరిగింది డి యం హెచ్ ఓ గారు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుతూ మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కచ్చితంగా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు పరిష్కారం కాని పరిస్తితిలో మళ్ళీ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు అనంతరం ఉద్యోగులు ముట్టడి కార్యక్రమం విరమించడం జరిగింది
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు, రాష్ట్ర సలహాదారులు మాడివి నెహ్రూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుజ్జా సీతమ్మ, రాష్ట్ర కోశాధికారి కరక అర్జున్,ఐ ఎన్ టి యు సి డివిజన్ అధ్యక్షులు డి శ్రీనివాస్, డివిజన్ ప్రధాన కార్యదర్శి తాటి రామకృష్ణ, డివిజన్ ఉపాధ్యక్షులు టి ఆదిలక్ష్మి,కె భద్రకాళి, టి సీత, యం జయ, జి చంద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు
