
//పయనించే సూర్యుడు// సెప్టెంబర్24// మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన సంతోష్ వారం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కాగా నేడు సంతోష్ తో పాటు 10వ తరగతి చదువుకున్న అతని చిన్ననాటి మిత్రులు సంతోష్ కుటుంబాన్ని పరామర్శించి, అతడి భార్యకు మనోధైర్యం చెప్పి, ఎటువంటి సాయం కావాలన్నా మేమున్నామంటూ తక్షణ సహాయంగా రూ. 40000/- అందజేశారు. కార్యక్రమంలో సంతోష్ స్నేహితులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
