
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ2025 సంవత్సరానికి గాను పెద్ద శంకరంపేట్ మండలానికి స్మము (సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానైజషన్) క్రింద బ్యాటరీ స్ప్రేయర్లు కల్టివేటర్స్ పవర్ టీల్లర్స్ రోటవెటర్స్ పవర్ విడర్స్ స్ట్రా బేలర్స్ సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్లర్లు కొరకు అవసరం ఉన్న రైతులు అప్లికేషన్ ఫామ్ తో సహా పట్టా పాస్ బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్రెండు పాస్ ఫోటోలుక్యాస్ట్ జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ అప్లికేషన్ ఫారం నింపి తమ క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారిని సంప్రదించి అప్లికేషన్ ఫారం ఇవ్వగలరు దీనికిగాను చిన్న సన్న కారు రైతులు మాత్రమే అర్హులు ఇదివరకు లబ్ధి పొంది ఉన్న రైతులు అర్హులు కాదు ఏమైనా సందేహాలు ఉన్నచో వ్యవసాయ అధికారులను సంప్రదించగలరు