Wednesday, October 29, 2025
Homeఆంధ్రప్రదేశ్లంబాడీలను ఎస్ టి జాబితా నుండి తొలిగించాలి.తెలంగాణ ఆదివాసీ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ...

లంబాడీలను ఎస్ టి జాబితా నుండి తొలిగించాలి.తెలంగాణ ఆదివాసీ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి సంపూర్ణ మద్దతు.

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 26

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోనీ లంబాడీలను ఎస్ టి జాబితా నుండి తొలిగించాలని సాగుతున్న ఉద్యమంలో భాగంగా ఇటీవలే ప్రజా ప్రతినిధుల సుప్రీం కోర్ట్ ఇంప్లిడ్ పిటీషన్ లో భద్రాచలం ఎం ఎల్ ఏ తెల్లం వెంకట్రావు, ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ ఎం పి సోయం బాపూరావ్ తో పాటు, ఆంధ్రా ప్రాంతం నుండి సీనియర్ ఆదివాసీ నాయకులు, అడ్వకేట్ ఆత్రం నవీన్ కూడా ఇంప్లిడ్ అయినందుకు అభినందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ చింతూరు డివిజన్ ఛైర్మెన్ జల్లి నరేష్ ఆధ్వర్యంలో చింతూరులో సన్మానించారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి కేంద్ర కమిటీ సభ్యులు మడివి నెహ్రూ మాట్లాడుతూ.. లంబాడీలను ఎస్ టి జాబితా నుండి తొలిగించాలని తెలంగాణలో ఆదివాసీలు సాగిస్తున్న ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి మరియు భాగస్వామ్య ప్రజా, ఉద్యోగ, ఉపాధ్యాయ, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు బేషరతుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. 1/70, 3 జి ఓ, ఎస్ టి జాబితా నుండి లంబాడీల తొలగింపు అంశాలు ఉద్యమాలు రెండు తెలుగు రాష్ట్రాల ఆదివాసీల ఉమ్మడి ఉద్యమాలని ఈ అంశాలలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ తెలంగాణ ఆదివాసీలకు సంపూర్ణ మద్దతుగా అండగా ఉంటామని అలానేఐక్య ఉద్యమానికూడా సిద్దమని ప్రకటించారు.సీనియర్ నాయకులు ఆత్రం నవీన్ మాట్లాడుతూ..పార్టీలు, పాలకులు కలిసి ఆదివాసీల హక్కులను ఆధారంగా, రిజర్వేషన్లను, సంపదను దోచుకునే కుట్రతో.. రాజ్యాంగ విరుద్ధంగా, అర్థకల్ 342 మరియు 244 అధికారాలను కాలరాస్తు 1976 ప్రాంతంలో గిరిజనేతరులైన లంబాడిలను ఎస్ టి జాబితాలో కలిపి ఆదివాసీ సమాజ అభివృద్ధికి గండి కొట్టారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆదివాసీ సమాజమంతా ఏకమై గత రెండు దశబ్దాలుగా ఉద్యమస్తున్న ప్రభుత్వాలు పట్టించ్చుకోని కారణంగా న్యాయపోరాటానికి పునుకున్నమన్నారు. అలానే తెలంగాణాలో జరుగుతున్న లంబాడిలను ఎస్ టి జాబితానుండి తొలిగించాలని చేస్తున్న ఉద్యమనికి ఆంధ్రా ఆదివాసీలం సంపూర్ణంగా మద్దతుగా ఉంటామని, ఈ నెల 28న ఛలో భద్రాచలం – ధర్మ యుద్దానికి ఆదివాసీలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియ ఉద్యోగ నాయకులు తిమ్మ సాయి, తోడం దేసయ్య, ఏ పి ఏ జె ఏ సి డివిజన్ వైస్ చైర్మెన్ కారం.సాయిబాబు, చింతూరు మండల ఛైర్మెన్ పొడియం.రామకృష్ణ, చట్టి ఉప సర్పంచి తుర్రం.రాముడు, చింతూరు మండల వైస్ చైర్మెన్ కుంజా శ్రీను, జూనియర్ అడ్వొకేట్ ఆసి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments