
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా
బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గం ఎనిమిది మండలాలకు సంబంధించిన సుమారు 424 కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పండుగ కంటే ముందు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందుకోబోతున్న ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు మరియు దసరా పండగ శుభాకాంక్షలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మానవీయ కోణంలో తీసుకున్నటువంటి గొప్ప కార్యక్రమం ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కెసిఆర్ గారి స్వీయ జీవిత అనుభవం ఆలోచనల నుంచి పుట్టిందే ఈ పథకం పేదింటి కుటుంబంలో పెళ్లి అనేది భారంతో కూడుకున్నటువంటి పని అయినా తన కూతురు పెళ్లిని ఉన్నంతలో ఘనంగా చేయాలని అనుకుంటారు అటువంటి సందర్భంలో 12 ఏళ్ల క్రితం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు పేదింటిలో ఏ ఆడబిడ్డ పెళ్లి జరిగిన ప్రభుత్వం తరఫున ఒక మేనమామగా కొంతమేర సాయం చేయాలని నిర్ణయించి మొదట 50 వేల తో మొదలుపెట్టి తర్వాత 1 లక్ష నూట పదహార్లకు పెంచడం జరిగింది బాల్కొండ నియోజకవర్గంలో గత పది వత్సరాల లో సుమారు 12వేల కళ్యాణ లక్ష్మి షాదిముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి డబ్బులు పెళ్లి సమయంలో ఆ పేదింటి కుటుంబానికి ఎంతో కొంత ఆసరా అవుతాయి గత ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ పథకాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగించడం సంతోషం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ లక్ష రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు మేము వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చాడు ఈ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తుంది ఇచ్చిన తులం బంగారం హామి నెరవేర్చలేదు…ఇప్పుడు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందుకుంటున్న మహిళలకు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు చెక్ లు అందుకున్న ప్రతి లబ్ధిదారునికి ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నాకు మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన హక్కు బాధ్యత నాపై ఉంది తులం బంగారం ఇవ్వాలని అడిగితే కాంగ్రెస్ నాయకులు గొడవలు చేస్తున్నారు,భీంగల్ మండల కేంద్రంలో మంత్రి ని తులం బంగారం విషయమై ప్రశ్నిస్తే BRS నాయకుల పై లాఠీచార్జ్ చేసి కేసులు పెట్టారు.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రతిపక్ష బాధ్యత.. ఇచ్చిన హామీలు నేరవర్చడం అధికారంలో ఉన్నవాళ్ల పని కానీ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై గొడవలు చేయడం, అధికారం అడ్డపెట్టుకొని లాఠీఛార్జ్ లు చేయించడం ప్రజాస్వామ్యం కాదు ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నా హమీ అమలు చేయలేదు, బీడీలు చేసే అక్క చెల్లెళ్లకు ఆసరా పెన్షన్ 2000 నుండి 4000 లకు పెంచుతమన్నా హామీ అమలు చేయలేదు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నెరవేర్చలేదు.విద్యార్థులకు స్కూటి లు ఇస్తామన్నారు డానికి దిక్కులేదు. ఏ ఒక్క హామీ సక్రమంగ అమలు కాలేదు.ఇచ్చిన తులం బంగారం ఇతర హామీలను వెంటనే అమలు చేయాలనీ మహిళల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అమలు చేయని పక్షాన మహిళలందర్నీ కూడదీసి ప్రభుత్వాన్ని నీళదీస్తాం అసెంబ్లీ వేదికగా ఇతర అనేక మార్గల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అయ్యేవరకు కాంగ్రెస్ పార్టీ ని ఎండ గడుతూనే ఉంటాం. సమయం వచ్చినపుడు మహిళలుగా మీరు చేయాల్సిన పని చేయండి