
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా లో శనివారం రోజున
కొండ లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి సందర్భంగా వినాయక్ నగర్ లోని ఆయన చిత్రపటానికి రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం తెవడానికి ఎంత కృషి చేశారని, అదేవిధంగా తొలిమాలీ దశ తెలంగాణ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని, తెలంగాణ సాధించుకోవడానికి మంత్రి పదవిని రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి అని ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే విధంగా సామాజిక న్యాయం జరగాలని కొండ లక్ష్మణ్ బాపూజీ ఆలోచన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తుంది అని బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఎలక్షన్ నిర్వహిస్తామని, కాంగ్రెస్ పార్టీ నిబద్ధతో పని చేస్తుంది అని అన్నారు. యువత కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ఆలోచనలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని అన్నారు.
