
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా లింగారెడ్డిగూడ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం–IIలో శనివారం పోషణ మాసం కార్యక్రమాల్లో భాగంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు, పిల్లలు సాంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మలను అలంకరించి పాటలు పాడుతూ గ్రామ వాతావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ మహిళలు నృత్యాలు చేస్తూ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. పోషణ మాసం సందర్భంగా మహిళలకు మరియు యువతకు పౌష్టికాహారం ప్రాముఖ్యత, గర్భిణీ స్త్రీలు మరియు చిన్నారుల ఆహారపు అలవాట్లపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జయలక్ష్మి మాట్లాడుతూ పిల్లలు, గర్భిణీ స్త్రీలు, తల్లులందరికీ సమతుల్య ఆహారం అవసరమని, పౌష్టికాహారం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. ఈ సందర్భంగా సెక్టార్ అవేలేజర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ కృష్ణమ్మతో పాటు గ్రామంలోని మహిళలు, చిన్నారులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను మరింత ఉత్సాహవంతం చేశారు.బతుకమ్మ పండుగతోపాటు పోషణపై ప్రజల్లో చైతన్యం పెంచే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, ఆటలతో పండుగ వాతావరణం నెలకొంది. చివరగా పాల్గొన్న మహిళలకు మరియు చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం, మిఠాయిలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.