
రుద్రూర్, సెప్టెంబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లు, అక్టోబర్ 9 జడ్పిటిసి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఖరారు అయిన నేపథ్యంలో రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో సోమవారం మండల ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా పదాధికారులు, మండల పదాధికారులు ,ప్రధాన కార్యదర్శులు, గ్రామ బూత్ అధ్యక్షులు, స్థానిక సంస్థ ఎలక్షన్ లో పోటీకి సిద్ధంగా ఉన్న ఆశావాహులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వచ్చే అక్టోబర్ లో ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో బిజెపి అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉందని, ఎంపీటీసీలు జడ్పిటిసిలు క్లీన్ షిప్ చేసే దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ పైన కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని తెలిపారు.