
పయనించే సూర్యుడు అక్టోబర్ 4 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్నా అశోక్)
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్ద శంకరంపేట్ మండలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అసూరి మురళి పంతులు తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని మెదక్ జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి రాజీనామా లేఖను పంపుతున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పత్రికా విలేకరులతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతో పెద్ద శంకరంపేట్ పట్టణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాను తీసుకున్న రాజీనామాను ఆమోదించాలని కోరారు ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నాపై ఉంచిన విశ్వాసానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో తన భవిష్యత్తు కార్యచరణను ప్రకటించినట్లు తెలిపారు.