Thursday, October 23, 2025
Homeఆంధ్రప్రదేశ్బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ మండల...

బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళి పంతులు

Listen to this article

బి ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

పయని0చే సూర్యుడు అక్టోబర్ 4 పెద్ద శంకరంపేట మండలం మెదక్ జిల్లా( రిపోర్టర్ జిన్నాఅశోక్)

_నారాయణఖేడ్ నియోజకవర్గం

శంకరంపేట్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మురళి పంతులు మరియు శంకరంపేట్ పట్టణానికి చెందిన వార్డు మెంబర్లు మరియు వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు మరియు గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు నియోజకవర్గ అభివృద్ధి నిరంతరం కృషి చేస్తు ఎల్లవేళ సమస్యల పట్ల స్పందించడం చూసి వారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో దసరా శుభ సందర్భంగా ఈరోజు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మురళి పంతులు గతంలో మా నాన్నగారు స్వర్గీయ పట్లోళ్ల కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి తండ్రిగారు మరియు వారు కూడా కాంగ్రెస్ పార్టీ తోనే పని చేశారని ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు శంకరంపేట మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను అందరిని అడిగి వారి కోరిక మేరకు మురళి పంతులు కాంగ్రెస్ పార్టీలో కి మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడానికి ఎంతో మేలు జరుగుతుందని మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల కోరిక మేరకే ఈరోజు మురళీ పంతులు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు మురళి పంతులు పైన అనేకమంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారని వారు ఎక్కడైనా తప్పు చేస్తే నేను కూడా సహించేది లేదు ప్రభుత్వ భూమిని ఎక్కడైనా కబ్జా చేస్తే వారు సొంత నా పార్టీవారైనా సరే ఎవరైనా సరే నేను ఎప్పుడు ఎవ్వరిని ప్రోత్సహించను అని ఎమ్మెల్యే అన్నారు మురళి పంతులు వారి ఆధ్వర్యంలో ఇంకా భారీ చేరికలు ఉంటాయని నేనే ఒకరోజు శంకరంపేట్ మండలంలో పెద్ద ఎత్తున సభ పెట్టి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ అగ్ర నాయకులను వీలైతే పిసిసి అధ్యక్షులను గారిని పిలిచి పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు అనంతరం మురళి పంతులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా BRS పార్టీ కోసం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోసం ఎంతో కష్టపడి పనిచేశాను నా కష్టాన్ని గుర్తించలేకపోయారు మురళీ పంతులు అవేదన వ్యక్తం చేశారు నాపై కావలనే కొంతమంది కక్ష కట్టి దుష్ప్రచారం చేస్తున్నారని నేను ప్రభుత్వ భూమినీ కబ్జా చేసినట్టు నాపై నిందలు వేస్తున్నారని కానీ నేను ఎక్కడ ఒక గుంట కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేయలేదని ఎక్కడైనా కబ్జా చేసినట్టు నిరూపిస్తే నా సొంత పట్టా భూమిని ప్రభుత్వనికి ఇస్తానని మురళి పంతులు అన్నారు నా పై నమ్మకం ఉంచి నన్ను పార్టీ లో చేర్చుకున్నందుకు పార్టీ అభివృద్ధికై అహర్నిశలు కష్టపడి పనిచేస్తనాని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వారితోపాటు మండల కాంగ్రెస్ ముక్య నాయకులు తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments