Sunday, October 19, 2025
HomeUncategorizedఅంబేద్కర్ విగ్రహానికి కాల్చిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి

అంబేద్కర్ విగ్రహానికి కాల్చిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి

Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 4 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మునిసిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నం బాకం హరికృష్ణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి భారతదేశ సమైక్యత అఖండతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం బాధాకరమన్నారు వెదురు కుప్పం మండలం బొమ్మేపల్లి పంచాయతీ దేవళ0 పేట గ్రామంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పారదర్శకంగా విచారణ జరిపించాలన్నారు అసలు నిందితులను గుర్తించి వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలన్నారు చిత్తూరు జిల్లా పరిధిలో ఇటువంటి దారుణ సంఘటన జరగటం శోచనీయమన్నారు ఈ విషయంలో రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు మంచిది కాదన్నారు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి అసలు నిండితులను పట్టుకొని వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరా వృత0 కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ డిమాండ్ చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments