
పయనించే సూర్యుడు అక్టోబర్ 4 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి ; యాడికి మండల పరిధిలోని కోన ఉప్పలపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని డిప్యూటీ ఎంపీడీవో శశికళ ఏపిడి పుల్లారెడ్డి, సర్పంచ్ రామాంజనేయులు శనివారం గ్రామంలో అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ మురుగు, దుర్వాసన, దోమల వృద్ధిని నియంత్రించడానికి సహాయపడు తుంది. గృహాల నుంచి వచ్చే వ్యర్థ నీరు మ్యాజిక్ డ్రైన్‌లోకి రాగానే ఎక్కడికక్కడ ఇంకిపోతుంది.ఈ వ్యవస్థ వల్ల భుగర్భ జలాలుపెరుగుతాయని, గ్రామంలో ఉన్న వాగులు, చెరువులు కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉంటాయని,వీధుల్లో దుర్గంధ సమస్య ఉండదన్నారు. మ్యాజిక్ డ్రైన్ వలన సీజనల్ వ్యాధులు విష జ్వరాలు ప్రబలకుండా ఉంటాయన్నారు ఈ మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం 100 మీటర్ల పొడవును రూ .74,979/- ఖర్చుతో నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ పిడి అసిస్టెంట్ నరేంద్ర ,ఈసీ ఈశ్వర్ రెడ్డి ఏపీఓ చిన్న మద్దిలేటి, కార్యదర్శి అరుణ్ టి ఏ బాబా ఫక్రుద్దీన్, ఫీల్డ్ అసిస్టెంట్ గాంధీ పాల్గొన్నారు.