
బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు చాట్ పట రవీందర్ నాయక్ చోరువతో తప్పిన తిప్పలు
హర్షం వ్యక్తం చేస్తున్నా వాహనదారులు
( పయనించే సూర్యుడు అక్టోబర్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా మీదిగా బూరుగుల నుండి షాద్నగర్ వెళ్లే రోడ్డుపై కడియాల కుంట తండా సమీపంలో ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి దగ్గర నిర్మించిన కట్కేర్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం వందల వాహనాలు తిరుగుతున్నాయి ఈ రోడ్డుపై ఇంతకుముందు ఏర్పాటు చేసిన కట్ గేర్ కారణంగా వాహనాలు కింది భాగంలో తగలడంతో కారులలో ప్రయాణించి ప్రయాణికులు ఇక్కడ దిగి కార్లను దాటించడం జరుగుతుంది. ఇది గమనించిన కడియాల కుంట తండా టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చాట్ పట రవీందర్ నాయక్ కంకర మరియు ఇసుక, సిమెంటుతో రోడ్డును వాహనాలకు ఇబ్బంది కలగకుండా లెవెల్ చేయించడం జరిగింది. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.