
పయనించే సూర్యుడు న్యూస్ సూపర్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.బీసీ రిజర్వేషన్లపై తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.యబై శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని,ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం అంటూ వంగా గోపాల్ రెడ్డి ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఎల్లుండి విచారించనుంది.మరో వైపు బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 8వ తేదీన తిరిగి విచారణ జరపనుంది.ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఓ వైపు హైకోర్టులో మరో వైపు సుప్రీంకోర్టుకు ఈ అంశం చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.దీంతో బీసీ రిజర్వేషన్లను నలబై రెండు శాతానికి పెంచుతూ ఇచ్చిన జీవో నంబర్ తొమ్మిది విషయంలో హైకోర్టు,సుప్రింకోర్టులు ఏం చెప్పబోతున్నాయి?జీవో అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా లేక బ్రేకులు వేస్తాయా అనేది ఉత్కంఠగా మారింది.ఇప్పటికే హైకోర్టులో కేసు విచారణపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశావహులు ఉత్కంఠతో ఉండగా తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్‌తో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది.