గ్రామ దేవత ఆలయంలో దళితులకు ప్రవేశం లేదా
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 6 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
ఈ రోజుల్లో కూడా దళితులను చిన్నచూపు చూస్తున్నారా. దొరరిసత్రం మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల పాలెంపాడు గ్రామం ( ఏకొల్లు పంచాయతీ ) లోస్థానిక గ్రామ దేవత ఆలయంలో దళితులకు గర్భగుడిలో నైవేద్యం వేసేందుకు ప్రవేశం లేదు దీనిని స్థానిక యువత ఖండించింది ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో మూసేసిన ఆలయాన్ని తెరచడంతో దళితులు గర్భగుడిలో నైవేద్యం వేశారు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తుంది. డమాయి ప్రభాకర్ (కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం)KVPS తిరుపతి జిల్లా కార్యదర్శి