పయనించే సూర్యుడు అక్టోబర్ 8,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
- నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మరియు మెడికల్ కళాశాలలో పనిచేసే శానిటేషన్ కార్మికులకు మూడు నెలల వేతనాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ గారికి వినతి పత్రం అలాగే నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయం లోని స్పందన కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బి బాల వెంకట్ సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కే ఎం డి గౌస్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు ప్రసాద్ లు మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కళాశాలలో దాదాపు 80 మంది శానిటేషన్ శానిటేషన్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారాని 18, 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. చైతన్య జ్యోతి సంబంధించిన కాంట్రాక్టు బాలనాగిరెడ్డి అనే కాంట్రాక్టర్ అనగా 30 /9 /20 25 తేదీ నాటికి కాంట్రాక్టు పూర్తి అయింది. అయితే గత మూడు నెలలుగా వేతనాలు కార్మికులకు ఇవ్వకుండా, అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని మభ్యపెడుతూ మమ్మల్ని మోసం చేసే పద్ధతిలో ఉందని కార్మికులు ఎవరన్నా ఫోన్ చేసి జీతాలు అడిగితే కార్మికులను బెదిరిస్తూ నా నా బూతులు తిడుతూ నువ్వు ఎవరివై నాకు ఫోన్ చేసి అడగడానికి తమాషాలు చేస్తున్నావా అనే పద్ధతిలో కార్మికులను నికులను బెదిరిస్తూ ఉన్నాడు .అని గత మూడు నెలల నుంచి అనేక సందర్భాల్లో హాస్పటల్ సూపర్డెంట్ మరియు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గారికి వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా వారు కూడా అదిగో ఇస్తాను, ఇదిగో ఇస్తామని మభ్యపెడుతూ కార్మికులను మోసం చేస్తూ టెండర్ పూర్తి అయిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవు మేము వేతనాలు ఇవ్వలేము అనే పద్ధతిలో మాట్లాడుతూ కార్మికులను బెదిరిస్తున్నారనీ గతంలో హాస్పిటల్ సూపర్డెంట్ కి అనేకమార్లు వినతిపత్రం ఇచ్చిన సందర్భంగా కాంట్రాక్టు ఏజెంట్ గా ఉన్న వెంకటేశ్వర్ రెడ్డితో వారానికి ఇస్తాము 10 రోజులకి ఇస్తా మని కార్మికులను మోసం చేసి ఈ రోజు మా వేతనాలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నా డనీ వేతనాలు కార్మికులకు వెంటనే ఇవ్వకుంటే సిఐటియు శానిటేషన్ కార్మికులను కలుపుకొని ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులను ఫాతిమా మహేష్ రాజమ్మ వెంకటేశ్వరమ్మ రమణమ్మ సులోచన సునీత హరిప్రియ మంగమ్మ లీలావతి తోపాటు మెడికల్ కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు.

