
కోయిలకుంట్ల పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు నిన్నటి రోజున ఆళ్లగడ్డ డిపోకు సంబంధించిన ప్రైవేట్ బస్సు డ్రైవర్ పై దాడిని ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎం సుధాకర్ , ప్రైవేట్ బస్సు యూనియన్ డిపో సెక్రటరీ వెంకటేస్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ప్రైవేటు డ్రైవర్లుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వారికి రక్షణ కల్పించాలి. ఆర్టీసీ యాజమాన్యం రూల్స్ ప్రకారం డ్రైవర్లు ప్రయాణికులను ఎక్కించుకోవడం జరుగుతుంది. కానీ ప్రయాణికులు పరిమితికి మించి ఎక్కుతున్న క్రమంలో డ్రైవర్లు కంట్రోల్ చేస్తే వారిపైనే దాడులు చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రయాణికునికి ఏ ప్రమాదం జరిగినా డ్రైవరే కారకుడు అవుతున్నాడు. వారికి వచ్చే అరకొర జీతాలతో ఇటు ఆర్టిసి వాళ్ళతో అటు ప్రయాణికులతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎటువంటి జాబ్ సెక్యూరిటీ గాని, రక్షణ గాని ,వేతనాలు పెంచుకునేందుకు వారికి ఎటువంటి హక్కులు లేకపోవడం చాలా అన్యాయమని వారు తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించి కార్మికునికి నష్టపరం కల్పించి రాబోకాలంలో ఇలాంటివి పునరావృతం కాకుండా ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్లు సురేంద్ర, మహేష్, రాజు, కేశవరెడ్డి, అంబయ్య, సుబ్బరాయుడు, కేశవ, చెన్నయ్య, మధు, భాష ,మరియు సిఐటియు నాయకులు కిరణ్, బుజ్జి, మురళి, మరియు ఎమ్మార్పీఎస్జిల్లా నాయకులు కత్తి ఓబులేసు పాల్గొన్నారు.
