Sunday, October 26, 2025
Homeఆంధ్రప్రదేశ్నంద్యాల 4 వ వార్డు లో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి...

నంద్యాల 4 వ వార్డు లో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్”

Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 9,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

నంద్యాల పట్టణంలోని 4వ వార్డు నందు 4 వ వార్డు టిడిపి ఇంచార్జ్ షేక్ మజీద్ ఏర్పాటుచేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ హాజరై తన చేతులా మీదుగా పంపిణి చేశారు.
ఈ సందర్బంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం లాగా ఎవరి ఫోటో వేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్రణ మాత్రమే వేసి స్మార్ట్ కార్డును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ స్మార్ట్ కార్డ్ వల్ల రేషన్ సమాచారం మన మొబైల్ లోనే చూసుకోవచ్చు నెలనెలా రేషన్ పంపిణీ ఏ విధంగా తీసుకున్నామో ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చు అని ప్రజలకు తెలియజేయడం జరిగిందని ప్రజలు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ రంగ ప్రసాద్ , సుబ్బ లక్ష్మయ్య , పబ్బతి వేణు , పల్లె వెంకటసుబ్బయ్య , బింగుమల్లె శ్యాంసుందర్ గుప్తా , రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఉస్మాన్ , సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ లక్ష్మీ వరప్రసాదరావు , సచివాలయ సిబ్బంది , అధికారులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments