పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఆహార నాణ్యత, రుచిపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు త్వరలో టిఫిన్ సేవలు ప్రారంభం: నేతలు కూకట్పల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ క్యాంటీన్’లో పేదలకు అందుతున్న భోజనం నాణ్యత, రుచిని కూకట్పల్లి కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పరిశీలించారు. కూకట్పల్లి నియోజకవర్గ మాజీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు క్యాంటీన్‌ను సందర్శించి స్వయంగా భోజనం చేశారు. పప్పు, కర్రి, పచ్చడి తో భోజనం రుచిగా ఉన్నట్లు నేతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అక్కడ భోజనం చేస్తున్న స్థానికులతో నేతలు మాట్లాడి, ఆహారం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం మాత్రమే అందిస్తున్నారు. ఐదు రూపాయలు చెల్లించి పేదలు కడుపునిండా భోజనం చేస్తున్నారు. ఒక భోజనం పూర్తి ఖరీదు రూ. 29.83 కాగా, ఇందులో లబ్ధిదారుడు ఐదు రూపాయలు చెల్లిస్తుండగా, మిగిలిన రూ. 24.83ను జీహెచ్ఎంసీ సబ్సిడీ రూపంలో భరిస్తోంది. భోజనం నాణ్యత, రుచి చాలా బాగున్నాయని, ఇంత తక్కువ ధరలో మంచి ఆహారం దొరకడం సంతోషంగా ఉందని స్థానికులు నేతలకు తెలిపారు. ప్రజల నుంచి సానుకూల స్పందన రావడంతో నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం సతీష్ రెడ్డి మాట్లాడుతూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం, ఆకలి తీర్చాలనే సంకల్పంతోనే ఈ ఇందిరమ్మ క్యాంటీన్లను తిరిగి ప్రారంభించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా నేతలు ముఖ్యమైన ప్రకటన చేశారు. ప్రస్తుతం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల ముప్పై నిముషాల వరకు భోజనం అందిస్తుండగా, త్వరలోనే ఉదయం ఎడు గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిముషాల వరకు కేవలం ఐదు రూపాయలకే టిఫిన్ సేవలను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కరుణాకర్ నాయుడు,114 డివిజన్ ప్రెసిడెంట్ తమ్మినేని ప్రవీణ్ కుమార్,115 డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణ రాజ్ పుత్, మేకల మైకల్, ఏ ఎం సి డైరెక్టర్ ఫణీంద్ర, డివిజన్ సీనియర్ నాయకులు రాజేష్ గౌడ్, కృష్ణారెడ్డి, పవన్ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…


