పయనించే సూర్యుడు అక్టోబర్ 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం చేజర్ల మండలం ఆదురుపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులకు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత, అది జీవిత నాణ్యత మరియు నిద్ర పై చూపే ప్రభావం గురించి ప్రిన్సిపాల్ హెచ్. పద్మజ , బి మల్లికార్జున వివరించారు.ప్రతిరోజు యోగా,వ్యాయామం,మంచి ఆహారం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చని తెలిపారు.భావోద్వేగ సహాయం కోసం కుటుంబం, స్నేహితులు, ఉపాధ్యాయులతో భావాలను పంచుకోవడం అవసరమని సూచించారు.మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించారు.అలాగే సందర్భంగా బాలికల సాధికారత,సమానత్వం పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్
పద్మజ,మల్లికార్జున బాలికల హక్కులు, భవిష్యత్తు అభివృద్ధి,సమాజంలో పాత్రపై ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

