పయనించే సూర్యుడు, అక్టోబర్ 10( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్
సారంపల్లి గ్రామ అంగన్వాడి కేంద్రంలో రికార్డు బుక్కులు మాయమవడంపై కాంగ్రెస్ నేతలపై వస్తున్న ఆరోపణలు తీవ్ర రాజకీయ వాదనలకు దారితీసాయి. ఈ ఘటనపై టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగల రాజు మండిపడ్డారు.శుక్రవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మునిగల రాజు మాట్లాడుతూ, “సారంపల్లి అంగన్వాడి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం దురదృష్టకరం. రికార్డు బుక్కులు మాయమవడంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి. కానీ నిజాలను వక్రీకరించి కాంగ్రెస్ నేతలపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలి” అని అన్నారు.అతను మరింతగా మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజాసేవే ధ్యేయంగా పనిచేసింది. అబద్ధపు ఆరోపణలతో ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తే తగిన సమాధానం ఇస్తాం. రాజకీయాల్లో ప్రతిపక్షాన్ని దూషించడం కాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడాలని టిఆర్ఎస్ నాయకులకు గుర్తుచేస్తున్నాం” అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారు కూడా టిఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ, కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచిన ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని సంకల్పించారు.

