
పయనించే సూర్యుడు అక్టోబర్ 11 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
నంద్యాల జిల్లా మహానంది మండలం ఎం సి ఫారం గ్రామంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న జనార్ధన్ నాయక్ అనే విద్యార్థి ఈతకు వెళ్లి మృతి చెందినట్లు సమాచారం. కళాశాల సెలవు దినం కావడంతో విద్యార్థులు పాలేరు వాగు వద్దకు సుమారు పదిమంది కలిసి బట్టలు ఉతికి, ఈత కొట్టేందుకు వెళ్లి అస్వస్థకు గురయ్యాడని స్థానికులు పేర్కొన్నారు. తోటి విద్యార్థులు గమనించి బయటకు తీసి కళాశాల అధికారులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్సులో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోని మృతి చెందినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న మహానంది పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది.


