
పయనించే సూర్యుడు అక్టోబర్ 12, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
- నంద్యాల జిల్లా మహానంది మండలం చెంచులక్ష్మి గూడానికి చెందిన 67 కుటుంబాలు భవనాసి శ్రీనివాసు (వాసు) ఆధ్వర్యంలో జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చేరాయి.చెంచులక్ష్మి గూడం నాయకులు శ్రీను, మేకల చౌడేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు భవనాసి శ్రీనివాసు (వాసు), పిడతల సుధాకర్, దండు మురళీ కృష్ణ, నాగి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తమకు ఎదురవుతున్న అనేక సమస్యలను భవనాసి వాసు, పిడుతల సుధాకర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా అటవీ శాఖ అధికారుల నుండి వస్తున్న ఇబ్బందులు,గూడంలో తాగునీటి సమస్య, విద్యా సదుపాయాల లోపం వంటి అంశాలను వివరించారు.ఈ సందర్భంగా భవనాసి వాసు, పీడుతల సుధాకర్ మాట్లాడుతూ చెంచులక్ష్మి గూడం ప్రజల సమస్యలను మేము స్వయంగా పరిశీలించామని వారికి ఉన్న సమస్యలను సాదరంగా విన్నామని, ఈ సమస్యలను జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి తెలియజేసి, అటవీ శాఖకు సంబంధించిన లీగల్ ఇబ్బందులను పరిష్కరించే చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు. ఈ వేడుకలో దండు మురళీకృష్ణ, నాగి వెంకటేశ్వర్లు, చందు, గ్రామ పెద్దలు ప్రసాద్, మురళి, చక్రపాణి, చందు, రామకృష్ణ, నగేష్, రామసుబ్బయ్య, విజయుడు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.