అమలాపురంలో జూలై 23న బిజెపి జిల్లా పదాధికారుల సమావేశం
పయనించు సూర్యుడు జులై 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ; డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి పదాధికారులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మోర్చాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మండల ఇన్చార్జిలు, ఎస్.ఐ.ఆర్ 7 కోఆర్డినేటర్స్ అందరికీ నమస్కారములు. జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ బుధవారం ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5.00 గం ల వరకు, అమలాపురం ముమ్మిడివరం గేట్ వద్ద గల సత్యనారాయణ విలాస్, మేడ పైన, ఏసి హాల్ నందు జిల్లా పదాధికారుల సమావేశం జరుగునని తెలియ జేయడ మైనది.ఈ ముఖ్యమైన సమావేశానికి రాష్ట్ర బిజెపి సంఘటన మాత్యులు నూకల మధుకర్, జోనల్ ఇన్చార్జి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, మన జిల్లా ఇన్చార్జి కారంకి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. అలాగే జిల్లా లో ఉన్న రాష్ట్ర నాయకులు కూడా పాల్గొంటారు.సర్ ప్రక్రియపై రాబోయే స్థానిక ఎన్నికలు మరియు విధానాలపై చర్చించడంతో పాటు పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందించనున్నాము. కావున అందరూ తప్పనిసరిగా హాజరు అవ్వాలని హృదయపూర్వకంగా కోరు కుంటున్నాము. హాజరైన వారందరికీ విందు ఏర్పాటు చేయడమైనది.ఇదే సమావేశంలో ఇదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుండి జిల్లాలోని 28 మండలాల అధ్యక్షులు ప్రత్యేకంగా నూకల మధుకర్ తో సమావేశమై వారి సూచనలు సలహాలు స్వీకరిస్తారు.